డోంట్ వరీ తమ్ముళ్లు మనదగ్గర చాలా పులులు ఉన్నాయి

డోంట్ వరీ తమ్ముళ్లు మనదగ్గర చాలా పులులు ఉన్నాయి

0
91

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ఉద్దేశిస్తూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు… అసెంబ్లీలో తమ పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు…

అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ నాయకులు లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు… తన పార్టీలో ఇప్పటికీ 23 మంది పులులు ఉన్నారని అన్నారు… అందులో నుంచి ఒక పులి లాక్కున్నంత మాత్రనా ఇంకా తమ పార్టీలో 22 పులులు ఉన్నాయని అన్నారు…

ఒక్కరు వెళ్లిపోయిన మాత్రానా పార్టీకి వచ్చే నష్టం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు… గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన కారణంగా ఇతర నేతలను కూడా జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు…