ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు… అయితే దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు….
గోదావరి, కృష్ణా, పెన్నా, నదులలోకి భారీగా నీరు రావడంతో ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు… ఈ సమస్య మరో వారం రోజుల్లో తీరుతుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న 275 ఇసుక రీచ్ లను త్వరగా ప్రారంభిస్తామని అన్నారు.
ప్రతీ రోజులు మూడులక్షల టన్నుల ఇసుకను పంపిణీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు… రాష్ట్రంలో ఏ అంశం లేనట్లు ప్రతిపక్ష పార్టీలు ఇసుక అంశాన్ని పట్టుకుని ఊగుతున్నారని జగన్ ఆరోపించారు… ఈ సమస్య తాత్కాలికమేనని అన్నారు… ఇచ్చిన వాక్దానాలకు తూచా తప్పకుండా పాటిస్తున్నామని జగన్ అన్నారు..