కూల్ డ్రింక్స్ అతిగా తాగుతున్నారా – ముందు ఈ లక్షణాలు గుర్తించండి చాలా డేంజర్

-

ముందుగా ఓ విషయం తెలుసుకోవాలి, కచ్చితంగా కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి చాలా చేటు, చిన్నపిల్లలకు ఎంతో ప్రమాదం అనేది వైద్యులు చెప్పేమాట, కాని చాలా మంది ఇప్పుడు ఈ ప్యాకేజ్ డ్ డ్రింకులకి అలవాటు పడుతున్నారు, పలు వ్యాధులు రావడానికి ఇది ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

- Advertisement -

కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ప్రాణానికే ముప్పు ఉందని ఫ్రాన్స్ లోని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ నిర్వహించిన పరిశోధన లోస్పష్టం చేశారు. వీటిలో కృత్రిమ చక్కెరను ఉపయోగించడమే ప్రధాన కారణం అని చెబుతున్నారు, అంతేకాదు, ఇలాంటి డ్రింక్స్ ఎక్కువగా తాగితే పేగుల సమస్యలు వస్తాయి, క్యాన్సర్ సమస్య వస్తుంది.

కూల్ డ్రింక్ ఉండే ఫాస్పోరిక్, కార్బోనిక్ ఆమ్లాల వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. ఈ డ్రింకులు తాగడం వల్ల దంతాలు నాశనం అవుతున్నాయి. అలానే రక్త ప్రసరణ సమస్యలు, జీర్ణ సంబంధిత వ్యాధుల వస్తున్నాయి, పేగు సమస్యలు కూడా బాధిస్తున్నాయి.
అంతేకాదు రోజుకి దీనిని 200 ఎం ఎల్ తీసుకున్నా డయాబెటీస్ కి దారి తీస్తుంది. గుండె జబ్బులు, అధిక బరువు, మొదడు మొద్దుబారడం, శరీరంలో లోపలి భాగాలు చెడిపోవడం వంటివి జరుగుతాయి.. సో కూల్ డ్రింక్ అప్పుడప్పుతూ తీసుకుంటే ఏం పెద్ద ఇబ్బంది లేదు కాని తరచూ తాగితే ప్రమాదమే, నెలకి ఓసారి తీసుకుంటే ప్రమాదం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...