ధూళిపాళ్ల నరేంద్ర దారెటు టీడీపీ ఆలోచన

ధూళిపాళ్ల నరేంద్ర దారెటు టీడీపీ ఆలోచన

0
87

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న నాయకులు చాలా మంది ఇప్పుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారు.. వల్లభనేని వంశీ రేపిన చిచ్చు మరికొంత మందికి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయింది. ఎంతో కాలంగా ఆవేధన ఉన్న నేతలు పార్టీ మారాలి అని చూస్తున్నారు. ఇదే మంచి సమయం అని భావిస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యే అయిన ధూళిపాళ్ల నరేంద్ర పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన టీడీపీకి వీరాభిమాని. కాని ఆయన పార్టీకి సేవ చేశారు .పార్టీ ఓటమి పాలైనా ప్రతిపక్షంలో ఆయన ఉండేవారు. కాని చంద్రబాబు గతంలో ఆయనకు సీనియర్ అని కూడా చూడకుండా మంత్రి పదవి ఇవ్వలేదు.

అయితే ఇలా ఆయన పార్టీ మార్పు పై అనేక వార్తలు రావడానికి కారణం కూడా ఉంది.ఇటీవల ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే నారా లోకేష్ నియోజకవర్గంలోకి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర దూరంగా ఉన్నారు…అంతేకాదు చంద్రబాబుతో కూడా ఇటీవల దూరంగానే ఉంటున్నారు.. దీంతో ఆయన పార్టీ మారాలి అని భావిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. చూడాలి ఆయన దారి ఎలా ఉండబోతోందో.