ఈ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్…

ఈ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్...

0
63

రాష్ట్ర రాజకీయాల్లో కేఈ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది… నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉంటూ జిల్లాలో తమకంటూ ఒక ప్రత్యేక కేడర్ ఏర్పాటు చేసుకున్నారు… ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఒడిస్తారు… ఎమ్మెల్యేగా మంత్రిగా ఉపముఖ్యమంత్రి కేయి కృష్ణమూర్తి వన్నె తెచ్చాడు… ఇక ఆయన సోదరులు కూడా రాజకీయంగా తమదైన ముద్ర వేసుకున్నారు…

కర్నూల్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లో కేఈ క్యాడర్ ఉంది… 2019 ఎన్నికల్లో కేఈ కుటుంబం పోటీ చేసిన సెగ్మంట్ లలో వైసీపీ జెండా ఎగిరింది… ఇక పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో వారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు… కేవలం సొంత వ్యాపారాలకే పరిమితం అయ్యారని ఒక వర్గం అంటోంది…

జిల్లాలో తమదైన ముద్ర వేసుకున్నకేయి కుటుంబం ఇప్పుడు ఆ స్థాయి రాజకీయాలు చేయకుందని అంటున్నారు… ఈ క్రమంలో వీరు టీడీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి… ఒక వేళ కేఈ కుటుంబం టీడీపీకి గుడ్ బై చెబితే ఆ పార్టీ జిల్లాలో దుకాణం ఎత్తెయ్యాల్సిందే అంటున్నారు… కర్నూల్ జిల్లా పార్లమెంట్ పరిధిలో సగానికి సగం కేయి అనుచర వర్గం ఉంది…