ఈ జిల్లాలో చంద్రబాబు జాకీలెత్తి లేపుతున్నా తమ్ముళ్లు లేవకున్నారట..

ఈ జిల్లాలో చంద్రబాబు జాకీలెత్తి లేపుతున్నా తమ్ముళ్లు లేవకున్నారట..

0
87

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా గుంటూరు జిల్లా… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారు…. తాము చేసిన అభివృద్ది కార్యక్రమాలే 2019లో తమను గెలిపిస్తాయన తమ్ముళ్లు అందరు భావించారు కానీ జగన్ సునామికి అందరు కొట్టుకుపోయారు….

రేపల్లి, గుంటూరు వెస్ట్ మినహా ఎక్కడా టీడీపీ జెండా ఎగరలేదు… ఇందులో మద్దాలి గిరిధర్ కూడా వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు… ఇక ఫైనల్ గా మిగిలింది ఒక్క ఎమ్మెల్యేనే.. అయితే గుంటూరు ఎంపీ స్థానం మాత్రం అప్పుడు ఇప్పుడు టీడీపీ ఖాతాలోనే పడింది…

ఎంపీ సీటు టీడీపీ ఖాతాలో పడినప్పటికీ గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గ తమ్ముళ్తు పెద్దగా కనిపించకున్నారట… ప్రస్తుతం పార్టీ తరపున నాయకులు ఎవ్వరు ముందుకు రాకున్నారట…

గుంటూరు జిల్లాలో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు సమాజిక వర్గానికి చెందిన వారే… అయినా కూడా వారు పెదవి విప్పకున్నారట…కేసుల భయంలో వారు ఇంటికే పరిమితం అయ్యారని వార్తలు వస్తున్నాయి… ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు జాకీలెత్తి లేపుతున్నా కూడా వారు కదలకున్నారని అంటున్నారు…