Trs vs Bjp: త్వరలోనే టీఆర్‌ఎస్‌లో భూకంపం..సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత

0
116

బీజేపీ, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుండి అసమ్మతి నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మురళీధర్‌రావు టిఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్‌ఎస్‌లో త్వరలో భూకంపం రాబోతోందని, బీజేపీపై కామెంట్‌ చేసే ముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. టీఆర్‌ఎస్‌లో షిండేలను బీజేపీ తయారు చేయడం లేదన్న మురళీధర్‌రావు.. ఆ పార్టీలోనే అసమ్మతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.

బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించలేదని, కేవలం కేసీఆర్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేశారని మండిపడ్డారు. కేంద్రం BSNL, LICని అమ్మేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్‌, కేటీఆర్‌కు ఆర్థికశాస్త్రం తెలియదని మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు.