కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ను మార్చింది. మణిపుర్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27న తొలి దశ, మార్చి 3న రెండో దశ ఓటింగ్ జరుగుతుందని తొలుత ప్రకటించిన ఈసీ.. ఇప్పుడు ఆ తేదీల్లో ఈ మేరకు మార్పులు చేసింది. ఎన్నికల ఫలితం మాత్రం మార్చి 10నే వెలువడుతుందని స్పష్టం చేసింది.
ఈసీ కీలక నిర్ణయం..ఆ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ మార్పు
Easy key decision..Change of election schedule in that state