Flash: టీఆర్ఎస్ సర్కార్ కు ఈసీ షాక్..అక్కడ బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్

ec-shock-to-trs-government

0
103

టీఆర్ఎస్ సర్కార్ కు ఈసీ షాక్ ఇచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీంతో రెండు జిల్లాల మహిళలకు ఈసారి పండగకు చీరలు అందడం లేదు.

వారికి ఎన్నికల తర్వాత ఈ చీరలను పంపిణీ చేసే అవకాశముంది. మిగిలిని 31 జిల్లాల్లో యధావిధిగా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఈ ఏడాది బతుకమ్మ చీరలను 30 సరికొత్త డిజైన్లలో రూపొందించారు. 20 విభిన్న రంగులతో తీర్చిదిద్దారు. మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చీరలన్నింటిని జరి అంచులతో తయారు చేయబడి, 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో తయారు చేశారు. ఈ సంవత్సరం కోటి మందికి పైగానే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.