ఒక వైపు కరోనా మహమ్మారి కోరలు చాటుతోంది… మరో వైపు ప్రభుత్వం కరోనా నివారణకు అనేక చర్యలు చేపడుతోంది… అందులో భాంగంగానే అనుమానితులను కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మొదటి కాంటాక్ట్ రెండవ కాంటాక్ట్ వున్న వారిని క్వారంటైన్ సెంటర్లో 14 నుంచి 21 రోజులు ఉంచాలని వారు ఒకరికి నుంచి మరొకరికి కాంటాక్ట్ కాకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారు…
అయితే తాజాగా చిలమత్తురులో స్ధానిక బీసీ హాస్టల్ లో క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటుచేశారు.. అయితే ఆ క్వారంటైన్ లో వసతులను చూస్తుంటే ఈ క్వారంటైన్ సెంటర్ నివారణకాలేక కరోనా వ్యాప్తికా అన్న అనుమానం రాక తప్పుదు… ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి నిదర్శనంగా ఈ క్వారంటైన్ సెంటర్ నిలుస్తోందని అనడంలో అతిశయోక్తి లేదు…
క్వారంటైన్ లో 16 మంది ఉన్నారు… అక్కడ వీరు ముక్కు మూసుకుని దాదాను 11రోజులు ఉంటున్నారు… క్వారంటైన్ సెంటర్ ఎక్కడ చూసినా చెత్తా చెదారతో నిండిపోయింది… తినె తిండిని కూడా ముక్కు మూసుకుని తింటున్నారు… అంతా పరిశుభ్రంగా ఉంచుతామని నమ్మబలికారని కానీ రోజు రోజుకు పరిస్థితి దారుణంగా మారుతోందిన అంటున్నారు…