ఇంట్లో ఉన్న వ్యక్తిని వేటకొడవలితో నరికి చంపి…

ఇంట్లో ఉన్న వ్యక్తిని వేటకొడవలితో నరికి చంపి...

0
78

ఒక వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా పాకిపోతుంటే మరోవైపు కొన్ని చోట్ల పగలు ప్రతీకారం అంటూ రెచ్చిపోతున్నారు.. తాజాగా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని వేట కొడవల్లతో నరికి చంపారు… ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఇరగరాజు పల్లెలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

ఇరగరాజు పల్లిలో వెంకటేష్ నివాసం ఉంటున్నాడు… తాజాగా అతను నివాసం ఉంటున్న ఇంట్లోకి కొందరు చొరబడి అతన్ని వేటకొడవలితో అత్యంత పాశవికంగా నరికి చంపారు… ఆ తర్వాత హత్య చేసిన వ్యక్తులు వెంకటేష్ ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి పారియారు…

అనుమానం వచ్చిన స్థానికులు వెంకటేష్ ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి చూశారు… రక్తపు మడుగులో అతను పడిఉన్నారు… వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు… దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృత దేహాన్ని స్వాదీనం చేసుకున్నారు… కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు…