ఇది అసలైన రాజకీయం చిరుకు జగన్ కీలక పదవి ఫిక్స్

ఇది అసలైన రాజకీయం చిరుకు జగన్ కీలక పదవి ఫిక్స్

0
102

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కీలక పదవి ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… త్వరలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి ఆ నాలుగు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి… అందులో ఒక సీటు వైసీపీ తరపున చిరుకు ఇవ్వాలని జగన్ అభిప్రాయ పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

దీంతో జనసేన పార్టీకి చెక్ పెట్టడమే కాకుండా కాపుసామాజికవర్గం కూడా తమ వైపు తిరిగే అవకాశం ఉందని వైసీపీ అధిష్టానం బావిస్తోందట… కొద్దికాలంగా చిరు జగన్ తో సఖ్యతగా ఉంటున్నారు… ఇటీవలే తాను నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని వీక్షించాలని కోరుతు సీఎ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే…

ఆ తర్వాత మూడు రాజధానుల విషయంలో కూడా చిరు వైసీపీకి మద్దతుగా నిలిచారు…. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు… కాగా ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అలాగే నటుడు నందమూరి తరకరామారావు భార్య లక్ష్మీపార్వతికి పదలవులను కేటాయించిన సంగతి తెలిసిందే.