ఇది అసలైన సంక్రాంతి పండగంటే…. మహేష్ కు సిఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్

ఇది అసలైన సంక్రాంతి పండగంటే.... మహేష్ కు సిఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్

0
149

అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు… ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించింది… విజయశాంతి కూడా ఈ మూవీలో ప్రత్యేకంగా కనిపించనుంది… ఈ చిత్రం ఈ నెల 11న భారీ త్రం అంచనాల మధ్య రిలీజ్ చేయనుంది చిత్రం భృందం…

అంతేకాదు సైనికాదికారి పాత్రలో మహేష్ నటించడం ఇదే తొలిసారి కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది… సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ మంచి గిఫ్ట్ ను అందించింది…

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అదనపు షోలు ప్రదర్శించడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… సినిమా విడుదల అయిన రోజు నాటినుంచి 17వతేదీవరకు అదనపు షోలను వేసుకునే వెసులుబాటు కలిపించింది… సాధారణ థియేటర్లు మొదలు కుని మల్టీప్లెక్సీలవరకు అన్నిరకాల సినిమాహాళ్లలకు ఉత్తర్వులను జారీ చేసింది వైసీపీ సర్కార్