ఇది జరిగితే జగన్ జైలుకే

ఇది జరిగితే జగన్ జైలుకే

0
107

మాజీ టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సంచలన కామెంట్స్ చేశారు… ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే కేబినెట్ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు… తాజాగా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు….

మాట తప్పని మడమ తిప్పని నేత అయితే సమావేశాలు వెలగపుడిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు… అమరావతిలో సాయంత్రం అయ్యే సరికి పందులు తిరుగుతాయని స్మశనంగా ఉంటుందన్న వారు ఇక్కడ సమావేశం నిర్వహిస్తే తెలుస్తుందని అన్నారు…

భూ కుంబకోణం సంబంధించి సీబీఐ విచారణ చేస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని ఉమా హెచ్చరించారు… అధికార బలంతో వైసీపీ నాయకులు విశాఖలో ఇన్ సైడర్ ట్రెండింగ్ లో ఎవరైతే భూములు కొన్నారో వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు… ఉమా అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్ లు అమరావతిలోనే నిర్వహిస్తామని అన్నారు…