‘టిఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండే ఆ మంత్రే’

0
80

తెలంగాణ రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే లాగా టీఆర్ఎస్ లోను జరుగుతుందని బీజేపీ, కాంగ్రెస్ నాయకులూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండే మంత్రి శ్రీనివాస్ యాదవే. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఏక్నాథ్ షిండేగా శ్రీనివాస్ యాదవ్ ని తెచ్చావు కదా అని కేసీఆర్ ను నిలదీశారు.