ఇక నుంచి సీఎం జగన్ కొత్తరకం పాలిటిక్స్….బాబు, పవన్ లకు దబిడి దిబిడే

ఇక నుంచి సీఎం జగన్ కొత్తరకం పాలిటిక్స్....బాబు, పవన్ లకు దబిడి దిబిడే

0
87

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త రకం పాలిటిక్స్ చేయాలా అంటే అవుననే అంటున్నారు వైసీపీ శ్రేణులు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించింది… గతంలో ఎన్నడు లేని విధంగా ఒకేసారి లక్షఉద్యోగాలు కల్పించి ప్రతీ పక్షాలను ముక్కున వేలేసుకునేలా చేసింది… ఏ రాష్ట్రంలో చేయని సాహసాన్ని చేసి పలువురి చేత షాబాష్ అనిపించుకున్నారు సర్కార్….

ఆ తర్వాత వైసీపీ పార్టీ రంగులను పంచాయితీ ఆఫీసులకు వేసిందని టీడీపీ గగ్గోలు పెట్టింది… అంతేకాదు దాని మీద టీడీపీ సానుభూతి పరులు కోర్టుకు వెళ్లారు… కోర్టు సైతం ఈ పిటీషన్లమీద విచారించి రంగులు మార్చేయమంది… దీంతో కోర్టు ఉత్తర్వుల తర్వాత మరో రంగు అదనంగా వేసి మరీ వైసీనీ కొత్త ఉత్తర్వు తెచ్చింది.. అయితే దాన్ని కూడా కోర్టు సస్పెండ్ చేసింది…

వాస్తవంగా చెప్పాలంటే రంగులు వేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉంది… ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పసుపు రంగుకు యమ గిరాకీ ఉండేది.. అయినా సరే ఇప్పుడు జగనే తప్పుచేశాడంటూ విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి… అయినా దీనిపై జగన్ పెదవి విప్పకున్నారు… ఇకనైనా జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విషయంలో గట్టిగా ఉండాలిని విపక్షాలకు దీటుగా స్పందించాలని సొంత పార్టీలో వినిపిస్తున్న మాట లేకపోతే వైసీపీకి రంగులు పేసేలా విపక్షం రెడీగా ఉందని అంటున్నారు…