కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు..నోటిఫికేషన్ ఎప్పుడంటే?

0
40
Telangana Congress Party

ఎన్నికల తేదీ ఖరారు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆదివారం సమావేశమైంది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జీ23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. సీనియర్ నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపాయి.

ఈ మేరకు ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేసేందుకు భేటీ అయిన సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపాయి.