ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు..అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Elections at any moment in AP..Achennaidu sensational comments

0
102

ఏపీ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో తెలుగు రైతు విభాగం కార్యశాలలో పాల్గొని ఆయన మాట్లాడారు.‘‘వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్‌ సీఎం అయ్యారు. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చని రెండేళ్లు ఉందని నిద్రపోవద్దు.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా తెదేపా 160కిపైగా సీట్లు సాధిస్తుంది’’ అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.