నేడు తెలంగాణ వ్యాప్తంగా కరెంటు కట్!..కారణం ఏంటంటే?

0
113

కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనికి నిరసనగా ఉద్యోగులు మహా ధర్నాకు పిలుపు నిచ్చారు. అంతేకాదు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఒకవేళ ఇదే జరిగి రాష్ట్రం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరించడం కష్టం అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు ప్రజలను కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టం ద్వారా తమకంటే కూడా వినియోగదారులకే ఎక్కువ నష్టం అని ఉద్యోగులు అంటున్నారు.

తమ ఆందోళనలను లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా విద్యుత్ చట్ట సవరణ సవరణ బిల్లును ప్రవేశపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. చట్టం ప్రవేశపెడితే విధులను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు.