ఎన్నికల వేళ ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

ఎన్నికల వేళ ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

0
95

రాజకీయాలు రాజకీయాలే కుటుంబాలు కుటుంబాలే అంటారు.. అయితే ఓ పార్టీ అంటే మరో పార్టీ అధినేతకు పడదు ఇలా రాజకీయంగా చాలా విమర్శలు చేసుకుంటారు, ఢిల్లీ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
రాజకీయాలు దేశభక్తికి అడ్డురావని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఫవాద్ చౌదరీ వ్యాఖ్యలు సరికావు అని అన్నారు, ఢిల్లీ ఎన్నికలు భారత్ అంతర్గత విషయం. మోదీ మా ప్రధానమంత్రి, ఆయనపై విమర్శలను మేము సహించమన్నారు.

పాక్ అంటేనే ఉగ్రవాద కార్యకలాపాలు అలాంటి పాక్ జోక్యం మాకు అవసరం లేదు అని అన్నారు ఆయన…ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. దీంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు, దీనిని రాజకీయాలకోసం ఉపయోగించుకోలేదు ఆయన.