ఈ 2 నెంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయద్దు కేంద్రం హెచ్చరిక

ఈ 2 నెంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయద్దు కేంద్రం హెచ్చరిక

0
131

మీ సెల్ ఫోన్ కు కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా అన్ నౌన్ నెంబర్ల నుంచి లిఫ్ట్ చేయకపోవడం బెటర్, మీ డేటా అంతా దొంగిలిస్తున్నారు, అంతేకాదు ఈజీగా మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు, ఇటీవల ఇలాంటి కేసులు భారీగా వస్తున్నాయి, అందుకే జర జాగ్రత్తగా ఉండాలి అని కేంద్రం కూడా హెచ్చరిస్తోంది.

ఇలాంటి కాల్స్ ఎక్కువగా +92 నెంబర్తో ప్రారంభమయ్యే నెంబర్ల నుంచే వస్తున్నాయి. ఈ మథ్య కొందరు అయితే వాట్సాప్ కాల్స్ కూడా చేస్తున్నారు, వాట్సాఫ్ మెసేజ్ లు లింకులు పంపుతారు, సో ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండండి.

అంతేకాదు +01 నెంబర్తో ప్రారంభమయ్యే కాల్స్ ద్వారా కూడా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి.
ఇలాంటి కాల్స్ వస్తే మీరు లిఫ్ట్ చేయవద్దు, ఇక వీరికి ఎలాంటి డేటా ఇవ్వద్దు, మీ ఓటీపీలు, నెంబర్లు, మీ బ్యాంకు ఖాతాలు, డెబిట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వద్దు, అంతేకాదు లక్కీ డిప్ వచ్చింది అని మోసం చేసే కాల్స్ కూడా ఇందులో ఉంటున్నాయి, మీకు టోకెన్ అమౌంట్ 1000 పంపుతాము అని చెప్పి మోసం చేస్తారు, సో జాగ్రత్త .