కరోనా పెద్ద విషయం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు… ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. థిస్ ఇస్ నిరంతర ప్రక్రియ అన్న జగన్ కరోనా పేరు చెప్పి కోర్టు ఎగ్గొట్టారని మండిపడ్డారు..
ఆయన ఆరోగ్యం బాగుంటే చాలు ప్రజలు పోయినా పర్వాలేదు అన్నట్టు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు బుద్దా వెంకన్న.
ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలని అన్నారు.. కరోనా బ్లీచింగ్ పౌడర్, పేరాసిట్మాల్ తో పోయేది కాదని బుద్దా వెంకన్న అన్నారు…