ఈఎస్ఐ స్కామ్ పై అచ్చెన్నాయుడు క్లారిటీ…

ఈఎస్ఐ స్కామ్ పై అచ్చెన్నాయుడు క్లారిటీ...

0
91

గతంలో తెలంగాణలో జరిగిన తరహాలో ఏపీ ఈఎస్ ఐలో స్కామ్ జరిగిందని తాజాగా విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు.. అంతేకాదు ఈ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందని తేలింది… దీనిపై ఆయన స్పందించారు.. తాను ఏ స్కాంలో లేనని స్పష్టం చేశారు… తాము ఎప్పుడు తప్పు చేయమని అవినీతికి పాల్పడే అలవాటు లేదని అన్నారు…

తాజాగా ఆయన పై వస్తున్న ఆరోపణలపై స్పందించారు… ఈ ఎస్ఐలో జరిగిన కుంభకోణంలో తన పాత్ర లేదని చెప్పారు.. 2016,17 వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నానని టెలి సర్వీసెస్ కు పనులు అప్పగించానని వార్తలు వస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పిన మేరకే తాము చేశామని అన్నారు…

తెలంగాణలో చేసినట్లే ఏపీలో చేశామని అన్నారు… కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు అచ్చెన్నాయుడు..