గవర్నర్ తమిళి సై కి ఈటల పుట్టిన రోజు శుభాకాంక్షలు

0
91

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాను మంత్రిగా ఉన్నప్పటి సమయంలో తమిళిసై తో దిగిన ఒక ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈటల రాజేందర్.

తమిళిసై ప్రజలకు మరింతగా సేవలు అందించాలని ఈటల ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, గవర్నర్ తమిళిసై సైందర రాజన్ జన్మదినోత్సవం ఒకే రోజు కావడం ప్రాధాన్యత కలిగిన విషయం.