ఎట్టకేలకు స్పందించిన పనబాక లక్ష్మీ ఊపిరి పీల్చుకున్నటీడీపీ

ఎట్టకేలకు స్పందించిన పనబాక లక్ష్మీ ఊపిరి పీల్చుకున్నటీడీపీ

0
92

తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయినా కూడా కాలు బయట పెట్టేందుకుబెట్టు చేసిన పనబాక లక్ష్మీ మెట్టు దిగినట్లు తెలుస్తోంది… పలువురు టీడీపీ నేతలు మంతనాలు అధినేత హామీలతో అమె ప్రచారానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది…

వారం రోజులకు పైగా టెన్షన్ పెట్టిన పనబాక లక్ష్మీ పట్టు విడడంతో టీడీపీకి ఉపశమనంగా మారింది… చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రచారానికి వెళతానని ఆమె కండీషన్ పెట్టినట్లు సమాచారం… దానికి టీడీపీ నేతలు అంగీకరించడంతో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది… అసలే టీడీపీ కష్టకాలంలో ఉంది..

పైగా ఉప ఎన్నికల్లో నెట్టుకురావడం చిన్న విషయం కాదు గుడ్డు స్థితిలో అనవసరంగా చేతులు కాల్చుకునేందుకు పనబాక కుటుంబీకుల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి…దాంతో ఆమె పేరుని ప్రకటించిన పది రోజుల తర్వాత కూడా కనీసం సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తూ ధన్యవాదాల ప్రకటన కూడా ఇవ్వలేదు…అయితే ఇటీవలే అధిష్టానం భరోసా ఇవ్వడంతో ఆమె బరిలో దిగేందుకు అంతా సిద్దం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి…