అపశృతి : ఎడ్ల బండిపై నుంచి కింద పడ్డ దామోదర రాజనర్సింహ్మ

0
83

దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం రాష్ట్రంలో చేపట్టిన తొలి నిరసన కార్యక్రమం ఇదే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. సైకిల్ యాత్ర, పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు.

అయితే పార్టీ శ్రేణులు గట్టిగానే ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ ఆందోళనలో భాగంగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ ఎడ్ల బండి మీద నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అయితే ఆయనతో సహా భారీసంఖ్యలో ఎడ్ల బండి ఎక్కారు నాయకులు కార్యకర్తలు. ఈ క్రమంలో బండిపై ఉండి ప్రసంగించే ప్రయత్నం చేసిన దామోదర రాజనర్సింహ్మ స్లిప్ అయి బొక్క బోర్లా పడ్డారు. ఆయనతోపాటు మరో కార్యకర్త కూడా కిందపడిపోయాడు.

వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.

https://www.facebook.com/alltimereport/videos/4793299280696683

https://www.facebook.com/alltimereport/videos/4793299280696683