మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను సంక్షేమ పథకాలను వ్యతిరేకించినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
రైతు బంధు పథకాన్ని తాను వ్యతిరేకించిన మాట వాస్తవమే అన్నారు. అయితే ఆ పథకాన్ని అనేకంటే ఆ పథకం అమలును వ్యతిరేకించినట్లు చెప్పారు.
ఇవాళ వందల కోట్ల రూపాయల ఇన్ కం ట్యాక్స్ కట్టే వారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పిన మాట వాస్తవం అన్నారు.
బెంజ్ కారులో వెళ్లేవారికి రైతు బంధు అవసరం లేదని వాదించానన్నారు.
పేద రైతులకు రైతుబంధు ఇవ్వండి అన్నట్లు చెప్పారు. దున్నని గుట్టలకు, దున్నని కంచెలకు రైతుబంధు ఇవ్వడం భావ్యం కాదని చెప్పినాను అన్నారు.
మంత్రి హరీష్ రావుకు టిఆర్ఎస్ లో అవమానాలు ఎలా జరిగాయో…ఈటల వివరణ కోసం కింద లింక్ క్లిక్ చేసి చదవండి…