సైకిల్ తొక్కలేకపోతున్నా… దిగిపోతానంటున్న మాజీ ఎంపీ

సైకిల్ తొక్కలేకపోతున్నా... దిగిపోతానంటున్న మాజీ ఎంపీ

0
76
TDP

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి అద్వానంగా తయారు అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం తమ్ముళ్లు సైకిల్ ను తొక్కలేక తొక్కుతున్నారట… 70 ఏళ్ల వయస్సులో చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా ధైర్యంగా సైకిల్ తొక్కుతుంటే తమ్ముళ్లు మాత్రం తొక్కలేక పోతున్నారట.

తాము సైకిల్ లో జెర్నీ చేయలేకపోతున్నామని కాసేపు ఫ్యాన్ కింద లేదంటే చెట్టుకింద కూర్చుని కమలం పువ్వు సువాసన చూసుకుంటూ కాస్త రిలాక్స్ అవ్వాలని చూస్తున్నాట. ప్రస్తుతం ఓ మాజీ ఎంపీ అలా ఆలో చిస్తున్నారట. తనకు టీడీపీలో రాజకీయ భవిష్యత్ ఉండదని అందుకే తాను కేంద్రంలో ఉన్న బీజేపీలోకో లేదంటే వైసీపీలోకి చేరుతానని స్పష్టం చేస్తున్నారట.

కాగా ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎంపీ కూడా పార్టీ మారితే టీడీపీకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.