బండిసంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర పునఃప్రారంభం అయ్యేనా?

0
114

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచి రెండు విడతలు పాదయాత్ర పూర్తి చేసిన సంజయ్‌…. ఈ నెల 2న యాదాద్రి ఆలయం నుంచి మూడో విడత ప్రారంభించారు.

అనంతరం 15వ తేదీన జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. రోజు 15 నుంచి 16 కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. తొలిరోజే పర్యటనలో ఘర్షణ వాతావరణం ఉంది. పోలీసులు బందోబస్తు మధ్య యాత్ర కొనసాగుతోంది.

ఇక తాజాగా బండి సంజయ్ అరెస్ట్‌తో నిలిచిన ప్రజాసంగ్రామ యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కచ్చితంగా యాత్ర ఆగిన చోటే మొదలుపెడతానని ఇప్పటికే సంజయ్ చెప్పగా పాదయాత్ర కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఈ నెల 27న హనుమకొండలో బహిరంగ సభ నిర్వహణపైనా సందిగ్ధత నెలకొంది.