తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. కాగా గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికైతే సంక్రాంతి సెలవులతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇక తాజాగా రాష్ట్రంలో థర్డ్‌వేవ్ ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సెలవులను మరోసారి పెంచింది సర్కార్. తెలంగాణాలో 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తూ విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.