ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్ కు 50 వేల కోట్ల న‌ష్టం ఎందుకంటే

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్ కు 50 వేల కోట్ల న‌ష్టం ఎందుకంటే

0
97

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 7.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం నష్టపోయారు. తాజాగా ఈ వార్త వినిపిస్తోంది, అయితే దీనికి ఓ కార‌ణం కూడా తెలుస్తోంది.
ఫేస్‌బుక్‌ నుంచి కొన్ని కంపెనీలు ప్రకటనలు విరమించుకోవడమే ఇందుకు కారణం.

దీంతో ఈ వార్త తెలియ‌డంతో కంపెనీ షేర్లు కూడా 8.3 ,శాతం న‌ష్ట‌పోయాయి. యూనిలివర్‌ సంస్థ సోషల్‌ నెట్‌వర్క్‌లో ప్రకటనలు ఇవ్వడాన్ని ఆపేసింది, ఇక కోకోకోలా కూడా సోష‌ల్ సైట్లో యాడ్స్ ఇవ్వం అని తెలిపింది.

దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం మూడు నుంచి నాలుగుకు మారింది. లూయిస్‌ విటన్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మూడో స్థానానికి ఎగబాకారు. జెఫ్‌ బెజోస్‌, బిల్‌గేట్స్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. తాజాగా క‌రోనా కాలంలో కూడా చాలా కంపెనీలు యాడ్స్ పై భారీగా ఖ‌ర్చు చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యం తీసుకుంటున్నాయి, కాస్ట్ కంట్రోల్ చేస్తున్నాయి. ఇలా దాదాపు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ కు 50 వేల కోట్లు లాస్ వ‌చ్చింది అని తెలుస్తోంది.