హైద‌రాబాద్ లో అక్క‌డ‌కు వెళుతున్నారా ఇది తెలుసుకోండి

హైద‌రాబాద్ లో అక్క‌డ‌కు వెళుతున్నారా ఇది తెలుసుకోండి

0
30

హైద‌రాబాద్ లో కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, దీంతో తెలంగాణ‌లో చాలా ప్రాంతాల నుంచి హైద‌రాబాద్ రావాలి అని ప్లాన్ వేసుకున్న వారు కూడా వెన‌క‌డుగు వేస్తున్నారు, ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చే ఆలోచ‌న చేయ‌డం లేదు.

అయితే మార్కెట్ల‌కు కూడా వంద‌ల మంది జనం వ‌స్తున్నారు, దీంతో వ్యాపారులు కూడా క‌రోనా భారిన ప‌డుతున్నారు, అందుకే చాలా వ‌ర‌కూ మార్కెట్లు వారికి వారే నిర్ణ‌యం తీసుకుని క్లోజ్ చేస్తున్నారు.
తాజాగా పాతబస్తీలోని కొందరు వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 15 రోజుల పాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయించుకున్నారు.. దీంతో లాడ్‌ బజార్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ స్వచ్ఛందంగా 15రోజులు బంద్ పాటిస్తున్నారు. ఇక చార్మినార్ ప్రాంతంలో షాపులు తీయ‌రు, సుల్తాన్ బ‌జార్, అలాగే పార‌డైస్ బ‌జార్ మార్కెట్, సూర్య ట‌వ‌ర్స్ ఇవ‌న్నీ క్లోజ్ లోనే ఉంటాయి, పెద్ద పెద్ద మార్కెట్లో ఇక ప‌ది రోజులు క్లోజ్ చేయ‌నున్నారు..ఆదివారం నుంచి జూలై 5 వరకు బేగంబజార్‌ మూసివేస్తున్నట్లు అక్కడి వ్యాపారులు ప్రకటించారు. సో అందుకే ఆ ప్రాంతాల‌కు వెళ్ల‌కండి.