ఫేస్ బుక్ కొత్త యాప్ ఇక మరో ప్రపంచం

ఫేస్ బుక్ కొత్త యాప్ ఇక మరో ప్రపంచం

0
100

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇప్పటికే తన మార్కెట్ చాలా పెంచుకుంది.. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది వాడే యాప్ కూడా ఫేస్ బుక్ అనేది తెలిసిందే.. మెసెంజర్ యాప్ కూడా తీసుకువచ్చింది ఫేస్ బుక్.

ఇక తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన కొత్త యాప్ HOBBI ని విడుదల చేసింది. మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త యాప్ ను రూపొందించింది. ఇప్పటికే ఇదే తరహాలో అందుబాటులో ఉన్న Pinterest యాప్ తరహాలో HOBBIకూడా పనిచేస్తుంది.

అయితే ఇది ప్రస్తుతం ఐఫోన్ లో మాత్రమే వర్క్ అవుతుంది.. తర్వాత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో మాత్రమే అందుబాటులో ఉంది.. త్వరలో ప్లేస్టోర్ ఆండ్రాయిడ్ కు కూడా రానుంది. చాలా సింపుల్ గా దీనిని విడుదల చేశారు ఇప్పటికే దీనిని 5 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట.