భవ్య ఆనంద్‌ ప్రసాద్‌పై కేసు వెనుక అసలు నిజాలు…!!

-

భవ్య, అనుబంధ సంస్థలకు కలిపి 200 ఎకరాల భూమి ఉంది..అయితే ఈ భూమి అమ్మకం కోసం ప్రణీత్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది భవ్య సంస్థ. ఈ సంస్థలో ఎమ్మెల్యే, కుమారిడికి కూడా భాగస్వామ్యం ఉండగా ఈ ఒప్పందంతో 300 కోట్ల రూపాయల లబ్దిపొందింది. భూముల ధరలు పెరగడంతో ప్రణీత్‌ గ్రూప్‌ కొత్త డ్రామా ఆడడం మొదలుపెట్టింది. భవ్య, అనుబంధ సంస్థలకు సంభందించిన మరికొన్ని భూములు.. మిగిలిన భూములు కూడా పాత రేట్లు ఇవ్వమని ఒత్తిడి పెంచింది.. పెరిగిన ధరలు చెల్లిస్తేనే ఇస్తామని చెప్పారు భూయజవానులు, వాటాదారులు..

- Advertisement -

దీంతో రెండు సంస్థల మధ్య వివాదం తలెత్తితింది. రెండు సంస్థల మద్య అనేక సార్లు చర్చలు జరిగినా కొలిక్కిరాలేదు ఈ వివాదం.. దీంతో తమ భూమికి సంబధించి 23 కోట్లు బాకీ ఉన్నారంటూ ఎన్‌సీఎల్టీ నోటీసులు పంపారు భవ్య ఆనంద్‌ ప్రసాద్‌.. దీనిని దారి మళ్ళించేందుకు కేసుల పేరుతో కొత్త డ్రామా ఆడడం మొదలుపెట్టారు. ప్రణీత్‌ గ్రూప్‌ యాజమాన్యం వెనుక ఉన్న రాజకీయ రాజకీయ బలంతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసుల వెనుక ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హస్తం? కూడా ఉంది..

రెండు గ్రూపుల మధ్య భూ వివాదంపై 9 నెలలుగా కోర్టులో వివాదం జరగగా కోర్టు అనుమతితో అమెరికా వెళ్లారు భవ్య ఆనంద్‌ ప్రసాద్ .. అయితే కోర్టులో ఉన్న కేసులోనుంచే మరో కేసునమోదు చేశారు పోలీసులు.. 2 కోట్లు అప్పు ఉన్నాడంలో ఆనంద్‌ ప్రసాద్‌పై సత్యనారాయణ అనే వ్యక్తి కేసు పెట్టాడు. నిజానికి సత్యనారాయణ అనే వ్యక్తి ఎమ్మెల్యే బావమరిది.. సత్యనారాయణ ఎకౌంట్‌నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్‌ జరగలేదు..అదే అడిగితే వేరే కంపెనీ వచ్చిన డబ్బును తనదిగా చెప్పుకుంటున్నాడు.. ఆ కంపెనీ సత్యనారాయణదే అయితే సంస్థ పేరుతో కంప్లైంట్‌ ఇవ్వాలి కానీ కంప్లైంట్‌లో సదరు కంపెనీ పేరును ఎక్కడా పేర్కొనలేదు సత్యనారాయణ..

రాజకీయ, ఆర్ధిక, పోలీసుల బెందిరింపులతో తక్కువ ధరకు భూములు లాక్కునే కుట్ర చేసి భవ్య, ఆ సంస్థ ప్రమోటర్స్‌ భూములతో ఇప్పటికే 300 కోట్లకు పైగా లబ్ది పొందిన ప్రణత్‌ గ్రూప్ మరో రెండు వందల కోట్లను అప్పనంగా కొట్టేసే ప్లాన్‌లో భాగంగానే ఈ వేధింపులు చేస్తున్నారని తెలుస్తుంది. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లినా పారిపోయాడంటూ ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు వేసే ఆలోచనలో ఉంది భవ్య గ్రూపు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....