కుమార్తె సీక్రెట్ గా ఫోన్ వాడుతోందని , తండ్రి ఎంత దారుణం చేశాడంటే

father attacked on daughter

0
97

 

ఈ రోజుల్లో కొందరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెద్దలకు తెలియకుండా బయట కలవడంతో పాటు సీక్రెట్ ఫోన్ కాల్స్ ఛాటింగ్ చేసుకుంటున్నారు.ఇక తల్లి దండ్రులు ఫోన్ కొని ఇవ్వకపోతే వారి ప్రియుడు ఫోన్ కొని ఇస్తే వాడుతున్నారు.మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో దారుణం చోటు చేసుకుంది.

తమ కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఆగ్రహించిన ఆ యువతి కుటుంబ సభ్యులు ఇద్దరు యువకులని చితకబాదారు, అంతేకాదు అందరి ముందు వారికి గుండు కొట్టించిమెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. దారుణంగా అందరి ముందు మొహంపై ఉమ్మి వేసి చావబాదారు.

రాజ్కుమార్ మెహ్రా అక్కడ స్దానిక యువతిని ప్రేమించాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం కోసం రాజ్ కుమార్ ఆ యువతికి మొబైల్ ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక ఆమె తల్లిదండ్రులు దీనిని గమనించి నిలదీస్తే అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ప్రేమికుడ్ని అతని స్నేహితుడ్ని చితకబాదారు ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు వచ్చింది, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.