గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందజేసింది. 9 పేజీల ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్లో ఉగ్రవాద కుట్ర గురించి నిఘా ఏజెన్సీల హెచ్చరికలు చేసింది. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు – కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించాలని, తద్వారా భారత ప్రతిష్టను దెబ్బ తీయాలని పథక రచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
అలాగే హైదరాబాద్ లోని బిజెపి పార్టీ కార్యాలయానికి కూడా… ఉగ్ర వాద ముప్పు ఉన్నదని ఇంటెలిజెన్స్ పేర్కొంది. బీజేపీ పార్టీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉండాయి హెచ్చరించిన ఇంటిలిజెన్స్.. పార్టీ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారని కూడా స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ బిజేపి నేతలు అలర్ట్ అయ్యారు.