టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్దిపై వైసీపీ నేతలు కత్తితో దాడి

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్దిపై వైసీపీ నేతలు కత్తితో దాడి

0
141

కర్నూలు జిల్లాలో ఎన్నికల వేళ దారుణం జరిగింది. ఓ పక్క తెలుగుదేశం అభ్యర్దుల జాబితా విడుదల అవడంతో, నేతలు తమ ప్రచారాలను కూడా చేసుకుంటున్నారు.126 మంది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు ఈ సమయంలో, కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ- వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడంతో వారు రంగ ప్రవేశం చేశారు.

ఈ ఘర్షణలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. దీంతో అక్కడ గోడవల వాతావరణం ఏర్పడింది..ఈ ఘర్షణలో ఎడమ కాలికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన నేతలు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఈ ఘటనలో ఏఎస్సైకి కూడా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా తెలుగుదేశం నేతలు ఆయనని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.