పరిస్దితి ఇలాగే ఉంటే ఇంకా లాక్ డౌన్ సమయం పొడిగించే అవకాశం ఉంటుంది అంటున్నారు ఉన్నత ఉద్యోగులు, ఎందుకు అంటే రోడ్లపైకి జనం రాకుండా ఉంటే కచ్చితంగా ఈ 21 రోజుల్లో కరోనాని అరికట్టవచ్చు ..కాని కొన్ని ప్రాంతాల్లో ఇంకా జనం రోడ్లపైకి వస్తున్నారు.
ఇంటి నుంచి బయటకు రావడంతో ఈ ఇబ్బంది మరింత పెరుగుతోంది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుని 21 రోజులు కచ్చితంగా పాటించాలి, ఒకవేళ జనాలు ఇలాగే వస్తే కరోనా ప్రభావం పెరిగితే, దీని సమయం లాక్ డౌన్ మరింత పొడిగించే అవకాశం ఉంటుంది అని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అంచనా వేశారు.
యూఎస్, ఇటలీ వంటి దేశాల్లో మాదిరిగా, పెద్ద ఎత్తున మరణాలు సంభవించకుండా చూడాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, మంచి నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు, లక్షల మందికి సోకితే మన దేశంలో అంత పెద్ద ఎత్తున వైద్య సౌకర్యాలు అందించడం కష్టం అవుతుంది అని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు.