రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలి అని చూస్తున్నారు.. ఏపీలో ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన చేయడానికి ఉగాది నుంచి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇక ఎలాగో అమరావతి నుంచి అసెంబ్లీ జరుపనున్నారు.
తాజాగా ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో సీమలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది, ముఖ్యంగా కర్నూలుకు గత వైభవం వస్తుంది అంటున్నారు.
విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలు కర్నూలుకు తరలించనున్నారు.
ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు తెలిపారు, అక్కడ కలెక్టర్ కు ఆర్ అండ్ బీ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు వెళ్లాయి.