తెలంగాణ: సిద్ధిపేటలోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనితో 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తుంది.