ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, దారుణం గా ఎండల వేడి స్టార్ట్ అయింది.. దీంతో స్కూళ్లకు వచ్చే విద్యార్దులకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటోంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలో ఒంటిపూట బడుల షెడ్యూల్ ను ఖరారు చేశారు.
ఇక విద్యాశాఖ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఇక మరో పది రోజుల్లో పిల్లలకు ఒంటి పూట బడులే.. ఇక తరగతి అయిన తర్వాత వారికి ఫుడ్ పెడతారు… మధ్యాహ్న భోజనం తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు.
1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ మేరకు ఒక్కపూట బడులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు…ఓ వైపు ఎక్కువగా ఎండలు ఉంటున్నాయి… మరో పక్క కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి… దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక స్కూళ్లలో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి అని తెలిపారు మంత్రి.
|
|
ఏపీలో విద్యార్దులకి – ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు – టైమ్ ఇదే
-