దేశంలోనే తొలిసారి..తమిళనాడులో ‘డీఎన్​ఏ సెర్చ్​ టూల్’

For the first time in the country..DNA search tool in Tamil Nadu

0
102

ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్​’ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ​ప్రారంభించారు. దేశంలో ఈ సాంకేతికతను వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అయితే ఈ టూల్ దేనికి పని చేస్తుందో తెలుసా?

ఈ టూల్ అంతరాష్ట్ర నేరస్థులను కనిపెట్టడం, తరచూ నేరాలకు పాల్పడే వారిని పసిగట్టడం, గుర్తు తెలియని మృతదేహాలను, అస్థిపంజరాలను గుర్తించడం వంటి పనులు సులభమవుతాయని అధికారులు తెలిపారు. అలాగే తప్పిపోయిన, కిడ్నాప్​కు గురైన పిల్లలను డీఎన్​ఏ ఆధారంగా పసిగట్టి తమ తల్లిదండ్రుల చెంతకు చేర్చగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.

రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగం ఈ టూల్‌ను అభివృద్ధి పరిచింది. ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించే ప్రక్రియ కూడా దీంతో సులువవుతుంది. డీఎన్​ను సాంకేతికతతో మిళితం చేసే టెక్నాలజీని విదేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడు ఒక అడుగు ముందుకేసి ఈ  ఈ సాంకేతికత దేశంలో మొదటిసారి వాడుతున్నారు.