దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఓటు వేయొచ్చు..!

0
83

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తాజాగా మరో విషయంలోనూ ఓ అడుగు ముందు వేసేందుకు సిద్ధమైంది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ని ఉపయోగిస్తూ ఎన్నికల వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు టీసెక్‌ ఈ వోట్‌ పేరుతో ఆండ్రాయిడ్‌ యాప్‌ని రూపొందించి ఈ వోటింగ్‌ పద్దతికి డిజైన్‌ చేశారు.

ప్రస్తుతం బ్యాటెల్‌ ఓటింగ్‌ ఈవీఎం పద్దతిలో ఓటింగ్‌ జరుగుతోంది. వీటికి తోడు ఉద్యోగస్తులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ పద్దతిలో కూడా ఓట్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక ఈ ఓటింగ్ తో స్మార్ట్ ఫోన్ నుండే ఓటు వేయొచ్చు. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఆధారిత ‘ఈ-ఓటింగ్’ యాప్‌ని అభివృద్ధి చేస్తోంది.

ఈ మేరకు డమ్మీ ఎన్నికల ప్రక్రియను ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు అక్టోబరు 8 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రిజిస్టరైన వారి ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తారు. అనంతరం అక్టోబరు 20న తొలి దశ డమ్మీ పోలింగ్‌ నిర్వహించనున్నారు.