మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

Former CM Chandrababu's sensational decision

0
129

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. దీనితో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు, సెటైర్లు నడిచాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. సభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. అసెంబ్లీ సమావేశాల నుంచి చంద్రబాబు వాకౌట్ చేశారు.

సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయిన బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సవాల్ చేశారు. మళ్లీ గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేశారు.