ఏపీ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు.
ఇంతటి ఘోరమైన సభ చూడలేదు. కౌరవుల సభలా వ్యవహరించారు. నా భార్యని నీచ రాజకీయాలలోకి లాగడం హేయం. తప్పని చెప్పాల్సిన స్పీకర్ నోరు మెదపలేదు. తమ్మినేని గతాన్ని మర్చిపోయారు. ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమ్మినేని నాకు మైక్ ఇవ్వకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంతకంటే నాకు ఎం పదవులు అవసరం లేదు ప్రజలు తెలుసుకోవాలి. తప్పులని వేరొకరిపై రుద్ది పైశాచిక ఆనందం పొందుతున్నారు
ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది. ప్రజాక్షేత్రంలో తేలుచుకుంటా..రికార్డులు నాకు కొత్త కాదు. రాజకీయాలకు సంబంధం లేని నా భార్యని దూషించడం నీచం. రాజకీయాల్లో విలువల ఉండాలనే ఇంతకాలం ఊరుకున్నాను. క్రమశిక్షణ ఉంది కాబట్టే సైలెంట్ ఉన్నాను. మాకు చేత కాక కాదు ఇంత కంటే నీచంగా మాట్లాడగలను. ప్రజలు నాకు మద్దతు ఇవ్వాలి. రాష్ట్రానికి పట్టిన పీడ వదలాలి.
మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడాతా. మన ఇంటి వాళ్ళని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అదే నా ఆవేదన అంటూ కన్నీటితో ప్రెస్ మీట్ ముగించిన చంద్రబాబు.
https://www.facebook.com/alltimereport/videos/222194809973111