గాంధీ భవన్ కు పూర్వ వైభవం – రేవంత్ రెడ్డి కొత్త ఆపరేషన్

0
95

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వరుస నిరసన కార్యక్రమాలు, ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొస్తున్నారు.

తెలంగాణాలో ఇప్పుడప్పుడే ఎన్నికలు ఏం లేవు. ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారమో హడావిడో జరుగుతుంది కానీ క్లారిటీ మాత్రం లేదు. ఎవరి అంచనాలు వారివే..ఎవరి అభిప్రాయాలు వారివే..కొందరు 2022 డిసెంబర్ అంటారు. మరికొందరు 2023 మార్చి అంటారు. ఎవరెన్ని అనుకున్న కేసీఆర్ చెప్పిందే ఫైనల్ అది అందరికి తెలిసిందే. కానీ ఈలోపు సైలెంట్ గా ఉంటే సైడ్ చేస్తారనే భావనతో రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సాహిస్తున్నారట. వచ్చే వారు రావాలంటూ గాంధీభవన్ డోర్లు బార్లా వుంచారట.

గతంలో హస్తానికి హ్యాండ్ ఇచ్చిన వారిని స్వయంగా ఆహ్వానిస్తున్నారట. ఇదంతా బాగానే ఉన్న ఇప్పుడే ఎందుకీ చేరికలు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అస్థ్రానికి పదును పెడుతుంటే తానేమి తక్కువ కాదని చెప్పడానికి పార్టీల్లోకి వలసలు పెరిగాయని చూపించడానికి రేవంత్ ఓ నిర్ణయం తీసుకున్నారట. తెలంగాణాలో ఎన్నికలకు సమయం ఉన్న పార్టీలన్నీ ఇప్పటి నుండే గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

రెండు రోజులుగా కాంగ్రెస్ లో చేరికలతో గాంధీభవన్ లో సందడి నెలకొంది. టీపీసీసీ చీఫ్ ఈ మధ్యే డిజిటల్ మెంబెర్ షిప్ ప్రారంభించారు. ఇప్పుడు చేరికలపై దృష్టి సాధించారు. తాజాగా ఉపాధ్యాయుల సంఘం మాజీ నాయకుడు హర్షవర్షన్ పార్టీలో చేరగా ఎర్రబెల్లి ఇలాకా నుండి భారీగా చేరికలు జరిగాయి. జనగామ నుండి జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 300 మంది కాంగ్రెస్ లో చేరారు.

తెలంగాణలో ఈ మధ్య జరుగుతున్న అన్నదాతల విషయాలపై కేసీఆర్, మోడీ వెనకుండి ఎంకరేజ్ చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిందేమి లేదని కమలం వైపు తన బాణాన్ని గురిపెట్టారు రేవంత్. రాష్ట్రంలోని సమస్యలన్ని పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటూక్యాడర్ ను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. అలాగే ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. మరి కమింగ్ డేస్ కాంగ్రెస్ వే అంటున్న రేవంత్ డైరెక్షన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.