మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు..వారి నాలుకలు కోయాలంటూ..

Former minister Paritala's sensational remarks..should cut their tongues ..

0
110

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలే టార్గెట్‌గా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు పరిటాల సునీత.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలలో గౌరవ సభ- ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమాల్లో సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వైసీపీ నేతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు లాంటి గంభీరమైన వ్యక్తితోనే వీరు కన్నీరు పెట్టించారంటే.. వైసీపీ నేతలు అన్న మాటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తే కూర్చోమని.. అవరసమైతే వారి నాలుకలు కోయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపైనా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సోదరులు రాప్తాడు నుంచి పెనుకొండ వరకు భూముల సెటిల్‌‌మంట్స్ చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. చెన్నేకొత్తపల్లిలోని ఒక డాబాలో, అనంతపురం రూరల్ లో ఒక కళ్యాణమండపంలో, రాప్తాడులోని ఒక తోటలోని గెస్ట్ హౌసుల్లో పంచాయతీలు జరుగుతున్నాయన్నారు.