నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా…

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా...

0
90

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు అలాగే అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.. అయితే ఇదే క్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు…

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. అమరావతి ఏకైక రాజధాని కావాలని కోరుతున్న విశాఖ నుంచి ఎన్నికైన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ పదవులుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలస్ విసిరారు… అప్పడు అమరావతి కావాల విశాఖ కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు… వాటిని చూసి టీడీపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని అవంతి శ్రీనివాస్ వాపోయారు..