ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు

Funeral of the late former CM Roshaiya

0
99

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు అశ్రునయనాల నడుమ ముగిశాయి. కొంపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రం దేవరయాంజాల్​ ఫామ్​హోస్​​లో రాష్ట్ర ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. సాయంత్రం 3గంటల 50నిమిషాలకు అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు.

అంత్యక్రియలకు మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు వివేకానంద, గణేశ్​ గుప్తా, కోలేటి దామోదర్ గుప్తా, బీసీ కమిషన్​ ఛైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు.. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బోత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పేర్నినాని, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.