గన్నవరంలో టీడీపీకి ఊహించని షాక్

గన్నవరంలో టీడీపీకి ఊహించని షాక్

0
86

గన్నవరంలో వల్లభనేని వంశీ రాజీనామా స్పీకర్ ఆమోదిస్తే ఆరునెలల్లో అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఇది పక్కా అనే చెప్పాలి. ఆయనతో తెలుగుదేశం నేతలు చర్చలు జరుపుతున్నా ఆయన మాత్రం పార్టీలో ఉండేది లేదు అని చెప్పారు.. అయితే వైసీపీలో ఆయన చేరితే ఇద్దరు అక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు రెడీ, కాని తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఇప్పుడు అసలు లిస్టులో ఎవరూ లేరట. ఉన్నా నేతలు కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారట.

ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఆయన గుడివాడకు మాత్రమే పరిమితం అవుతాను అని చెబుతున్నారట, ఇక జిల్లాలో కీలక నాయకురాలు జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధను అక్కడి నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు..కాని ఆమె భర్త మాత్రం పోటీలో ఉండము అని తెలియచేశారట.. ఇక నారాలోకేష్ కూడా మంగళగిరి వదిలేసి ఇక్కడకు వస్తే ఒకవేళ ఓటమి వస్తే లోకేష్ రాజకీయాలకు ఇది మైనస్ అవుతుంది అని ఆలోచన చేస్తున్నారు.

అందుకే ఇక్కడ నుంచి దేవినేని ఉమా మాత్రమే ఆప్షన్ గా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.. కాని స్ధానిక కేడర్ మాత్రం ఆయనకు సపోర్ట్ ఉండము అంటున్నారట.